దుబాయిలో తాండ్ర(జి) వాసి మృతి
- April 29, 2018
తాండ్ర(జి)(సారంగాపూర్): తాండ్ర(జి) గ్రామానికి చెందిన మహ్మద్ తాజొద్దిన్(22) దుబాయిలో గుండె పోటుతో మృతి చెందారు. ఈ నెల 26న విధులు ముగించుకుని తన గదికి రాగా..తెల్లవారే సరికి నిద్రలోనే ప్రాణాలు విడిచారు. స్నేహితులు ద్వారా ఈ విషయం తెలిసిందని తల్లిదండ్రులు ఆదివారం వివరించారు. తాజొద్దిన్‌ది నిరుపేద కుటుంబం కావడంతో ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లారు. తండ్రి అన్నుసాబ్, పెద్దన్న రాజాక్ మృతి చెందారు. మరో అన్న ఇబ్రహీమ్‌తో కలిసి తాజొద్దిన్ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతలో యువకుడు గుండె పోటుతో మృతి చెందడం ఆ కటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. మృతుడికి తల్లి, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ప్రభుత్వం చొరవ చూపి కుమారుడి మృతదేహం త్వరగా ఇంటికి వచ్చేలా చూడాలని తల్లి నన్నుబి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!







