సౌదీ అరేబియాలో మహిళ జిమ్‌లపై నిషేధం...

- April 29, 2018 , by Maagulf
సౌదీ అరేబియాలో మహిళ జిమ్‌లపై నిషేధం...

సౌదీ అరేబియా:కఠిన చట్టాలకు మారుపేరైన సౌదీ అరేబియాలో మహిళ జిమ్‌లపై నిషేధం విధించారు. ఒక అమ్మాయి రియాద్‌లోని ఒక జిమ్‌ సెంటర్‌లో స్కిన్‌ టైట్‌ దుస్తులు ధరించి వ్యాయమం​ చేసింది. దాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అదికాస్త వైరల్‌ అయింది. దాంతో మహిళల జిమ్‌లను నిషేధిస్తూ సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్పోర్ట్స్‌ అథారిటీ చీఫ్‌ తుర్కీ అల్‌ షేక్‌ మాట్లాడుతూ.. ఇలాంటి వాటిని తాము సహించేది లేదని తేల్చి చెప్పారు.

మహిళలు స్కిన్‌ టైట్‌ దుస్తులు ధరించడం సౌదీలో నిషేధం. అదే విధంగా ఆ వీడియోను ఆధారం చేసుకుని దర్యాప్తు చేయాలని తుర్కీ ఆదేశించారు. క్రీడల్లో మహిళలపై నిషేధాన్ని 2014లో ఎత్తేసిన సౌదీ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో అనుమతించింది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి హలిమా బోలంద్‌ అని తేలింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని నేను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. సౌదీ న్యాయ వ్యవస్థపై తను పూర్తి నమ్మకం ఉందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com