'రెడ్' యాపిల్
- April 29, 2018
ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తాజాగా ఐ ఫోన్ 8 ప్లస్ ను మార్కెట్ లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి వచ్చిన ఈ మొబైల్ ఎన్నడూ లేని విధంగా రెడ్ కలర్ లో దర్శనమిస్తోంది. దీని వెనకాల ప్రత్యేక కారణం ఉందండోయ్ అదేంటంటే..రెడ్ అనే సంస్థతోయాపిల్ కు దాదాపు 11 ఏళ్ల సంబంధం ఉంది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే..ఆఫ్రికా దేశంలోని ఎయిడ్స్ / హెచ్ఐవి భాదితులలో తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, కౌన్సెలింగ్ ను, మెడిసిన్ ను అందిస్తుంటారు.
ఇక తాజాగా రెడ్ సంస్థకు..యాపిల్ సంస్థ 160 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడానికి నడుం బిగించి..ఈ రెడ్ కలర్ లో ఐ ఫోన్ 8 ప్లస్ ఫోన్ ను తయారు చేసింది. ఈ ఫోన్ ధర మన ఇండియాలో రూ. 67,940 ఉండనుంది. ఇలా రెడ్ కలర్ ఉన్న ఏ యాపిల్ వస్తువు కొన్నా ఆ మొత్తాన్ని రెడ్ సంస్థకు విరాళంగా వెళ్లనుంది. తద్వారా ఎయిడ్స్ లేని సమాజాన్ని నిర్మించడంలో ఈ ఫోన్స్ కొన్నవారు భాగస్వామ్యం కానున్నారు.
మరోవైపు ఈ రెడ్ ఫోన్ రెండు వెర్షన్స్ గా రానుంది. ఒకటి 64 జీబీ కాగా మరొకరి 256 జీబీ లతో అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







