మళ్ళీ దెబ్బకొట్టిన ఫేస్‌బుక్
- April 29, 2018
డేటా లీక్స్ టెన్షన్ నుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్‌బుక్ అధినే మార్క్ జూకర్ బర్గ్ మరో బాంబు పేల్చారు. మున్ముందు మరింతగా డేటా లీక్ ఉండే అవకాశముందని ఫేస్‌బుక్ తెలిపింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన త్రైమాసిక నివేదికలో ఫేస్‌బుక్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫేస్‌బుక్ నుంచి సేకరించిన కోట్ల మంది డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా లీక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ చట్ట సభలు దీనిపై విచారణ జరుపుతున్నాయి. తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్‌బుక్ ఎస్ఈసీకి తెలిపింది. దీనివల్ల తమ బ్రాండ్, వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కూడా తెలిపింది. కేంబ్రిడ్జ్ అనలిటికా లీక్స్ వ్యవహారం కంపెనీ నిర్లక్ష్యానికి మున్ముందు భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలుస్తోంది. బ్రిటన్, యూఎస్ చట్టసభలు కంపెనీ భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!