తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- February 24, 2026
హైదరాబాద్: తెలంగాణలో నక్సల్ ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు అగ్రశ్రేణి నాయకులతో సహా మొత్తం నలుగురు కీలక నేతలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
లొంగిపోయిన వారిలో పార్టీలోని అత్యున్నత విభాగాలకు చెందిన వారు ఉండటం గమనార్హం పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (దామోదర్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి (గంగన్న) హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.
మావోయిస్టు నేత దేవ్ జీ మాట్లాడుతూ, అనారోగ్య కారణాల రీత్యా తాను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఇది కేవలం వ్యక్తిగత జీవితం కోసం కాదని, ప్రజల సమస్యలపై చట్టబద్ధమైన పద్ధతుల్లో (లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో) పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. “దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం గైడెన్స్‌గా ఇకపై రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను” అని ఆయన అన్నారు.
విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. తొందరపడి మాట్లాడితే అపార్థాలకు దారితీస్తుందని, తన భవిష్యత్ రాజకీయ జీవితానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం అన్ని విషయాలు పంచుకోలేకపోతున్నానని వివరించారు. త్వరలోనే ఇంటర్వ్యూల రూపంలో అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానమిస్తానని హామీ ఇచ్చారు. ఈ పరిణామం తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







