చిన్నారి చేతిని రక్షించిన సివిల్ డిఫెన్స్
- May 01, 2018గ్లాస్ డోర్లో ఇరుక్కుపోయిన చిన్నారి చేతిని అత్యంత చాకచక్యంగా సివిల్ డిఫెన్స్ సిబ్బంది రక్షించారు. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సివిల్ డిఫెన్స్ని అప్రమత్తం చేసింది. అప్రమత్తమయిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది, చాలా జాగ్రత్తగా గ్లాస్ డోర్ నుంచి చిన్నారి చేతిని బయటకు తీశారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా తల్లిదండ్రులు, తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ పేర్కొంది. అనుకోకుండా కొన్నిసార్లు ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటాయనీ, పిల్లల భద్రతకే తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుందని అధికారులు సూచించారు. ఒక్కోసారి చిన్న చిన్న ప్రమాదాలు, ప్రాణాల్ని హరించవచ్చునని అధికారులు తల్లిదండ్రుల్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..