ఇరాక్ కాల్పుల్లో 16 మంది మృతి..
- May 01, 2018
ఆయుధాలతో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్‌లోని సలాహుద్దీన్ ప్రావిన్స్‌లో నిన్న సాయంత్రం జరిగింది. బాగ్దాద్ నగరానికి సమీపంలో ఉన్న దుజైల్ పట్టణంలోని ఓ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన వ్యక్తి.. మూడు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన మూడు ఇళ్లు రహిమ్ అల్ మర్‌జౌక్ అనే న్యాయమూర్తి ముగ్గురు కుమారుల ఇళ్లుగా గుర్తించారు అధికారులు. చనిపోయిన వారంతా రహిమ్ అల్ మర్‌జౌక్ కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలే ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుడు పరారీలో ఉండటంతో.. గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు కల్నల్ మహమ్మద్ అల్ జుబౌరీ తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా