అనుష్క కు బర్త్‌డే కానుకగా..
- May 02, 2018
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ బర్త్‌డే నిన్న(మంగళవారం). ఈ సందర్భంగా కోహ్లీ విలువైన బహుమతిని ఇచ్చాడు. వివాహం తర్వాత అనుష్క తొలి బర్త్‌డే కావడంతో.. కోహ్లి ప్రత్యేక కానుక ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు. మంగళవారం ఐపీఎల్‌లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు సారధి కోహ్లి ఈ ప్రత్యేక విజయాన్ని తన భార్యకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తున్నట్టు పేర్కొన్నాడు.
మంగళవారం ఉదయం సతీమణి అనుష్కకు ట్విటర్ ద్వారా విషెస్ తెలిపిన కోహ్లి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ. 'అనుష్క ఇక్కడే ఉంది. ఈ రోజు తన బర్త్‌డే. ఈ విజయం తనకు చిన్న కానుక. ఈ విజయం చాలా ప్రత్యేకమైంది' అని అన్నాడు. దీనిపై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించి "ఈ ప్రత్యేకమైన బర్త్‌డేను ప్రపంచంలోనే తెలివైన, ప్రియమైన, ధైర్యవంతుడైన వ్యక్తితో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది" అంటూ పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!