శ్రీదేవి తరుపున నేషనల్ అవార్డు అందుకోనున్న కూతురు ఖుషీ కపూర్
- May 02, 2018
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 65వ జాతీయ సినీ అవార్డుల్లో ప్రముఖనటి, దివంగత శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'మామ్' చిత్రంలో నటనకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
కాగా, జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేడు (మే 3) ఢిల్లీలో జరుగనుంది. శ్రీదేవి తరుపున ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఈ వేడుకకు శ్రీదేవి భర్త, 'మామ్' నిర్మాత బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌లతో కలిసి హాజరు కాబోతున్నారు.
శ్రీదేవి తన కెరీర్లో పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది మాత్రం 'మామ్' చిత్రానికే. దీన్ని అందుకోవడానికి తమ అభిమాన నటి లేక పోవడం విచారకరమని పలువురు ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
తన బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి హోటల్ గదిలోని బాత్ టబ్‌లో ప్రమాదవ శాత్తు పడిపోయి మరణించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఆమె మరణించగా, ఫిబ్రవరి 28న ఇండియాలో అంత్యక్రియలు నిర్వహించారు. అతిలోక సుందరి అంతిమ యాత్రలో లక్షలాది మంది అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







