బేసిల్ చికెన్
- May 17, 2018కావలసినవి: క్యాప్సికమ్ - రెండు, తులసాకులు(గుజ్జు) - 10 గ్రాములు, ఉల్లికాడలు - 20 గ్రాములు, అల్లం - నాలుగు గ్రాములు, గుడ్డు - ఒకటి, ఉప్పు - రుచికి సరిపడా, మిర్చి గుజ్జు - 20 గ్రాములు, మైదా - 50 గ్రాములు, నూనె - వంద మిల్లిలీటర్లు, ఆయిస్టర్ సాస్, కొత్తిమీర - ఒక్కోటి 20 గ్రాముల చొప్పున, వెల్లుల్లి - 10 గ్రాములు, చికెన్ (బోన్‌లెస్) - 200 గ్రాములు. అలంకరించేందుకు మరికొన్ని తులసాకులు తీసుకోవాలి.
తయారీ: చికెన్‌ను శుభ్రంగా కడిగి ముక్కలు కోయాలి. కూరగాయల్ని కూడా కడిగి ముక్కలు కోయాలి. మైదాపిండిలో ఉప్పు వేసి గుడ్డు సొన కలిపి పిండి ముద్ద చేయాలి. చికెన్ ముక్కల్ని ఆ పిండిలో ముంచి వేగించాలి. ఒక పాన్‌లో నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిస్టర్ సాస్, మిర్చి గుజ్జు వేసి ఓ మాదిరి మంట మీద వేడిచేయాలి. తరువాత వేగించిన చికెన్ ముక్కలు, తులసాకుల గుజ్జు వేసి కలపాలి. తులసాకులతో అలకంరించాలి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..