బ్లూఫిలిమ్స్లో నటించి తప్పు చేశా..శృంగార తార సన్నీలియోన్
- May 26, 2018శృంగార తార సన్నీలియోన్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆమె అభిమానులను సైతం కదిలించేసింది. ఎంతో పశ్చాత్తాప పడుతూ చేసిన ఆ ట్వీట్ అభిమానుల గుండెలను పిండేసింది. ఆమె తన పాత జీవితం గురించి ఎంతో భావోద్వేగంతో చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాను సెక్స్ సినిమాల్లో నటించడానికి ముందు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు అలా ఉండాలని కోరుకుంటున్నాని... అలాంటి సినిమాల్లో నటించి చాలా తప్పు చేశానని ఆమె పశ్చాత్తాపం వ్యక్తంచేసింది.
సన్నీ ప్రస్తుతం దక్షిణాది సినిమా 'వీరమహాదేవి'లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా, తన జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ 'కరణ్ జిత్ కౌర్- ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్'ని ఆమె చూసింది. ఈ సందర్భంగా సన్నీలియోన్ ట్వీట్ చేస్తూ... ఆ డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదని, తన హృదయం కొన్ని వేలసార్లు బద్దలైందని పేర్కొంది. తాను నీలి చిత్రాల్లో నటించడానికి ముందు ఎలా ఉండేదాన్నో, మళ్లీ అలా కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదని, తన పాత వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుందని, తాను తప్పు చేశానని పేర్కొంది.
కాగా సన్నీ బాలీవుడ్‌కు రావడానికి ముందు అమెరికాలో వందలాది నీలి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌కు వచ్చే సమయానికి ఆమెపై అదే ముద్ర ఉంది. మొదట్లో ఐటెం సాంగులు చేస్తూ క్రమంగా ప్రధాన పాత్రల్లో నటిస్తూ మంచి నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నీలిచిత్రాల్లో నటించనప్పటికీ ఆమెను మాత్రం తన గతం వేధిస్తున్నట్లుగా తాజా ట్వీట్ బట్టి అర్థమవుతోంది. అందం, అభినయం ఉన్న సన్నీకి మాత్రం గత జీవిత ముద్ర ఇంకా వెంటాడుతూనే ఉంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం