హీరో నానీ చెప్పిన మరో గుడ్ న్యూస్
- June 15, 2018నానీ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు పండగే. హాయిగా సాప్ట్‌గా సాగిపోతుంది. ఎటువంటి హడావిడీ ఉండదు. అయినా ఆకట్టుకుంటుంది. కథలను తాను ఎంపిక చేసుకునే తీరు అతడిని స్టార్‌ని చేసాయి. బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నా మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఎంసీఏ వరకు బ్రేకుల్లేని బండిలా దూసుకుపోయినా కృష్ణార్జున యుద్ధం మాత్రం అభిమానులను నిరాశపరిచింది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తూ నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ మొదలు పెట్టాడు నానీ. ఇది ఓ పక్క జరుగుతుండగానే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశాడు. జెర్సీ అనే టైటిల్ దాని పక్కన క్రికెట్ బ్యాట్, హెల్మెట్ , గ్లౌజ్‌ల వంటి క్రికెట్ కిట్ ఉండడంతో ఇది ఆ గేమ్ నేపథ్యంలో సాగే సినిమాగా అనిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..