శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం..
- June 23, 2018యువ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశ చిత్రీకరణ అనంతరం దర్శకుడు కృష్ణ విజయ్ మాట్లాడుతూ.శ్రీ విష్ణుతో మరో చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉంది. అప్పట్లో ఒకడుండేవాడు, నీదినాదీ ఒకే కథ సినిమాల నిర్మాణంలో భాగమయ్యాం. ఇప్పుడీ చిత్రానికి నిర్మాణంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాము. జూలై నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. మూడు నెలలు వరుసగా షెడ్యూల్ ఉంటుంది. ఏడాది చివరలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ..ఈ సినిమాకు ఎవరం కొత్త వాళ్లం కాదు. మేమంతా కలిసి పనిచేస్తూనే ఉన్నాం. విజయ్ గారితో మళ్లి పనిచేస్తున్నాను. అందరికీ నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నా. అన్నారు. నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.ఇప్పటిదాకా సినిమాలను చూడటమే కానీ నిర్మాణ రంగంలోకి రాలేదు. విజయ్ ఈ కథ చెప్పినప్పుడు వెంటనే చిత్రీకరణకు వెళ్దాం అన్నంతగా నచ్చింది. అయితే విజయ్ కథను పక్కాగా సిద్ధం చేసుకుని వచ్చారు. చాలా కొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచే సినిమా అవుతుంది. అందుకు యూనిట్ అంతా కష్టపడుతున్నారు అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం - సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ - సిద్, ఎడిటర్ - ధర్మేంద్ర కాకర్ల, ఆర్ట్ డైరక్టర్ - మురళి
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు