బిగ్ బాస్ లో అలరించనున్న హెబ్బా
- July 14, 2018బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా రసవత్తరంగా సాగుతుంది. వారానికొకరు ఎలిమినేషన్ అవుతున్న ఈ సందర్భంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలకు పంపించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్-2లో ప్రస్తుతం సామ్రాట్, తేజశ్వి.. తనీష్ దీప్తి సునైనాల జంటలు అలరిస్తున్నాయి.
అయితే ఈమధ్య తేజశ్వి వ్యవహారం సామ్రాట్, తనీష్ లకు కూడా నచ్చట్లేదు. ముఖ్యంగా తనీష్, తేజశ్విల మధ్య గొడవ మొదలైంది. అందుకే ఇంట్లోకి ఓ కొత్త భామను తీసుకొచ్చే పనిలో పడ్డారట నిర్వాహకులు. కాస్త చప్పగా సాగుతున్న బిగ్ బాస్ ఎపిసోడ్స్ ను వేడెక్కించేందుకు హెబ్భా పటేల్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌజ్ లోకి పంపిస్తున్నారట.
అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా.. కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హెబ్భా ఆ సినిమాతో కుర్రకారు ఉర్రూతలూగించేలా చేసింది. ఆ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు హెబ్భా ఒకేరకమైన సినిమాలతో అలరించింది. ఇక బిగ్ బాస్ లో ఆమె ఎంట్రీ సర్ ప్రైజ్ కానుంది.
సినిమాలో తన హాట్ లుక్స్ తో అదరగొడుతున్న హెబ్భా పటేల్ బిగ్ బాస్ లో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ప్రస్తుతం హెబ్భా పటేల్ 24 కిస్సెస్ సినిమాతో వస్తుంది. ఆదిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్ కిస్సులతో కిక్ ఇస్తుందని అంటున్నారు. మరి బిగ్ బాస్ హెబ్భా ఎంట్రీ పై వస్తున్న వార్తలపై నిజమెంత ఉందన్నది చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ