రజనీని టార్గెట్ చేసిన కంగనా !
- July 16, 2018బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీ రోబో '2.ఓ' తరచూ వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేటుని ఫిక్స్ చేశారు. నవంబర్ 29న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రజనీ రాకతో మిగితా సినిమాలు సడైపోయాయి. ఐతే, బాలీవుడ్ క్వీన్ కంగనా మాత్రం తగ్గడం లేదట.
క్రిష్ దర్శకత్వంలో కంగనా 'మణికర్ణిక' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అనేకమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ సినిమాని కూడా రోబో 2.ఓ విడుదల డేటు నవంబర్ 29 న రిలీజ్ చేస్తున్నారట. ఇది ఇండస్ట్రీకి షాక్ కు గురి చేస్తోంది. రజనీతో కంగానా పోటీ పడటం ఆమెకే లాస్ అని చెబుతున్నారు. ఝాన్సీ రాణి జీవితం ఆధారంగా మణికర్ణిక తెరకెక్కింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్