దుబాయ్:'సైమా 2018' అవార్డుల వేడుకకు రంగం సిద్ధం
- July 16, 2018దుబాయ్:ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల వేడుక ఇటీవలే కన్నుల పండువగా ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలో సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ప్రారంభం కాబోతోంది. 7వ ఎడిషన్ సైమా అవార్డుల వేడుక ఈ సారి దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నారు.
'సైమా' నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లో వైభవంగా ఈ అవార్డుల వేడుక జరుగనుంది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఈ అవార్డుల వేడుకలో వివిధ కేటగిరీల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు ప్రధానం చేయబోతున్నారు. దీంతో పాటు సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖులను సత్కరించనున్నారు. సౌత్‌లోని నాలుగు సినిమా పరిశ్రమలకు చెందిన తారలతో కలర్ ఫుల్‌గా ఈ వేడుక జరుగనుంది.
గతంలో నిర్వహించిన సైమా వేడుకలను తలదన్నేలా ఈ 7వ ఎడిషన్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. అన్ని సినిమా రంగాల నుండి పెద్ద పెద్ద స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యేలా నిర్వాహకులు దృష్టి పెట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు దినేష్ కుమార్ ఉగ్గిన(అంజన్ స్టార్ ఈవెంట్స్,ఎం.డి) వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్