రోడ్డు ప్రమాదంలో బహ్రెయినీ డ్రైవర్ మృతి
- July 19, 2018మనామా: షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై బురి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బహ్రెయినీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. వాహనంపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైవేపై వున్న స్టీల్ ఫెన్స్పైకి వాహనం దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారు జిసిసి లైసెన్స్ ప్లేట్స్ కలిగి వుందనీ, ఈ ఘటనలో వేరే వాహనాల ప్రమేయం లేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పోలీస్ సకాలంలో అక్కడికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. సుమారు గంట వరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రమాదానికి గురైన కారుని అక్కడినుంచి తొలగించడంతో ట్రాఫిక్ అవాంతరాలు తగ్గాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ