శేఖర్ కమ్ముల దర్శకుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏషియన్ గ్రూప్
- September 17, 2018యాభై సంవత్సరాలుగా 600ల సినిమాలకు ఫైనాన్స్ అందించి ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాలలో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ప్రెస్టీజియస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోరూపొందే ఈ లవ్ స్టోరి కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
మల్టీప్లెక్స్ రంగంలో ఒక రివల్యూషన్ సృష్టించిన ఏషియన్ గ్రూప్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధాన భాగంగా ఎదిగింది. సినిమాను ప్రేక్షకులకు చేరువచేసే డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాలలో అగ్రగామిగా ఎదిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలో ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ ప్రయాణంలో తొలి అడుగు శేఖర్ కమ్ములతో కలసి వేస్తుంది. నిర్మాతలుగా నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు(FDC Chairman) వ్యవహారించ నున్నారు.
బ్లాక్ బస్టర్ మూవీ ఫిదా తర్వాత శేఖర్ కమ్మల చేయబోయే ప్రాజెక్ట్ మీద ఇండ్రస్టీలోనూ, ప్రేక్షకులోనూ ఆసక్తి నెలకొంది. కంటెంట్ ని తప్ప క్రేజ్ ని నమ్ముకోని శేఖర్ కమ్ముల నుండి రాబోతున్న ఈ లవ్ స్టోరీ కి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనుంది నిర్మాణ సంస్థ. amigos creations సమర్పణలో నిర్మించబోయే ఈ ప్రేమ కథకు నిర్మాతలుః నారాయణ దాస్ నారంగ్ , పి. రామ్మోహన్(FDC Chairman). కో ప్రొడ్యూసర్-విజయ్ భాస్కర్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ