విదేశాల్లో "ఎఫ్-2" షూటింగ్ పూర్తి
- September 17, 2018
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎఫ్ 2'. ఫన్ అండ్ ఫ్ట్రస్టేషన్ అనేది ఈ సినిమాకు ఉప శీర్షిక. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా 'ఎఫ్-2' చిత్రీకరణ జరుగుతోంది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగు కొంతకాలంగా విదేశాల్లో జరుగుతోంది.
కొన్ని రోజులుగా 'ప్రగ్వే'లో జరుగుతోన్న షెడ్యూల్ ఇప్పుడు పూర్తయ్యింది. అనిల్ రావిపూడి లొకేషన్లో సరదాగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపారు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమాలో, రాజేంద్రప్రసాద్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ తరువాత అనిల్ రావిపూడి చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే అందరిలోను అంచనాలు వున్నాయి. వెంకటేష్ వంటి సీనియర్, వరుణ్ తేజ్ వంటి జూనియర్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఇది క్రేజీ కాంబోగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







