74 ఏళ్ళ భార్యను గెంటేసిన భర్త
- September 18, 2018మనామా: ఓ బహ్రెయినీ వ్యక్తి, 74 ఏళ్ళ తన భార్యను వదిలేశాడు. 30 ఏళ్ళ వయసున్న ఓ ఆసియా మహిళను తాజాగా పెళ్ళి చేసుకున్న ఆ వ్యక్తి (వయసు ఏడు పదుల వున్న వ్యక్తి), తన మొదటి భార్యను ఇంట్లోంచి గెంటేశాడు. దాంతో బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం, బాధిత మహిళకు అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. ఆమెకు, తన భర్త ఇంట్లో వుండే హక్కు వుందనీ, ఆ ఇంట్లో చాలా సామాన్లు ఆమె తన కష్టంతో కొనుగోలు చేసిందని బాధిత మహిళ తరఫు న్యాయవాది చెప్పారు. వయసు రీత్యా అయినా బాధిత మహిళ పట్ల ఆమె భర్త, సానుకూలంగా వ్యవహరించి వుండాల్సిందని న్యాయవాది అల్ తమిమి అభిప్రాయపడ్డారు. ఇంట్లోంచి ఆమెను గెంటేయడం అక్రమం, అన్యాయం, నేరమని అల్ తమిమి చెప్పారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు