పందెం కోడి 2 మేకింగ్ వీడియో విడుదల
- October 13, 2018లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం సందకోళి 2. తెలుగులో ఈ మూవీ పందెం కోడి 2 పేరుతో విడుదల కానుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ చిత్రంలో లేడి విలన్‌గా కనిపించనుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై విశాల్, ధావల్ జయంతిలాల్, అక్షయ్ జయంతిలాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. ట్రైలర్లో విశాల్ రఫ్ఫాడించగా, కీర్తి సురేష్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. లేడి విలన్ గెటప్‌లో వరలక్ష్మీ లుక్ కేక పుట్టించింది. జాతర లో పులి వేషాలు వేయొచ్చు..కానీ పులి ముందే వేషాలు వేయకూడదు అనే డైలాగ్ అదిరిపోయింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీపై ఆసక్తి పెంచేలా మేకర్స్ పలు వీడియోస్ విడుదల చేస్తున్నారు. రీసెంట్గా మేకింగ్ వీడియో విడుదల చేయగా, ఇది అభిమానులని ఆకట్టుకుంటుంది. మీరు వీడియోపై ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..