ప్రిన్స్ మహేష్ బాబు హిందీ మూవీ ట్రైలర్ విడుదల
- October 13, 2018టాలీవుడ్ నటుడు మహేశ్ బాబుకు దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాకుండా వేరే రాష్ట్రాలలోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మహేశ్ నటించిన భరత్ అనే నేను బాక్సాపీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డు (బాహుబలిని మినహాయించి)ను కూడా సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో మహేష్ డైనమిక్ సీఎంగా కనిపించి సందడి చేశాడు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తమిళంలో భరత్ ఎనుము పేరుతో విడుదల కాగా, మలయాలంలో భరత్ ఎన్న అంజాన్‌గా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు హిందీలో అనువాదం జరుపుకున్న ఈ చిత్రం విడుదలయ్యేందుకు సిద్ధం కాగా, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. భారత్ :ది గ్రేట్ లీడర్ పేరుతో విడుదల కానున్న చిత్ర ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆర్ఎజీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ