ఎన్టీఆర్ కెరీర్ లో ఊహించని విజయం..
- October 14, 2018యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. రికార్డులన్నింటినీ చెరిపేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీకి మాస్ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సినిమా తొలివారం ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వందకోట్ల గ్రాస్ వసూలు చేయడమంటే మామూలు విషయం కాదు. బాహుబలి తరువాత ఈ సినిమానే ఆ రికార్డ్ సాధించిందని.. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్.. అన్నింటికీ మించి సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ ను చెరిపేసే దిశగా ఈ చిత్రం ఆడుతుందని వారంటున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఊహించనంత విజయం సాధించడంతో హైదరాబాద్‌లో చిత్రబృందం థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల