సౌదీ అరేబియా తో ఆయుధ ఒప్పందాన్ని రద్దు చేసుకోం
- October 14, 2018
వాషింగ్టన్ : సౌదీ అరేబియాతో 110 బిలియన్ల డాలర్ల ఆయుధ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి తాను వ్యతిరేకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అమెరికా ఆర్ధిక వ్యవస్థ, ఉద్యోగాలు దెబ్బతింటాయని అన్నారు. ఈ ఒప్పందం నుండి అమెరికా వైదొలగితే రష్యా, చైనా వంటి ఇతర దేశాలు ఆయుధాలను సరఫరా చేయడానికి సిద్ధంగా వుంటాయన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయినా ఈ ఒప్పందం కుదరడానికి, సైన్యానికి ఈ ఆర్డర్ రావడానికి తాను చాలా కృషి చేశానని చెప్పారు. ఇది చాలా పెద్ద అర్డర్ అని, 4,50,000 ఉద్యోగాలు దీనిపై ఆధారపడి వున్నాయన్నారు. సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి టర్కీలో అకస్మాత్తుగా అదృశ్యమైన నేపథ్యంలో సౌదీ అరేబియాపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ నుండి తీవ్ర ఒత్తిడి వస్తున్న తరుణంలో ట్రంప్ పై వ్యాఖ్య చేశారు. ఈ విషయం గురించి సమూలంగా తెలుసుకోవాలనుకుంటున్నానని, సౌదీని కూడా వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నానని ట్రంప్ విలేకర్లతో చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







