సౌదీ అరేబియా తో ఆయుధ ఒప్పందాన్ని రద్దు చేసుకోం
- October 14, 2018వాషింగ్టన్ : సౌదీ అరేబియాతో 110 బిలియన్ల డాలర్ల ఆయుధ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి తాను వ్యతిరేకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అమెరికా ఆర్ధిక వ్యవస్థ, ఉద్యోగాలు దెబ్బతింటాయని అన్నారు. ఈ ఒప్పందం నుండి అమెరికా వైదొలగితే రష్యా, చైనా వంటి ఇతర దేశాలు ఆయుధాలను సరఫరా చేయడానికి సిద్ధంగా వుంటాయన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయినా ఈ ఒప్పందం కుదరడానికి, సైన్యానికి ఈ ఆర్డర్ రావడానికి తాను చాలా కృషి చేశానని చెప్పారు. ఇది చాలా పెద్ద అర్డర్ అని, 4,50,000 ఉద్యోగాలు దీనిపై ఆధారపడి వున్నాయన్నారు. సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి టర్కీలో అకస్మాత్తుగా అదృశ్యమైన నేపథ్యంలో సౌదీ అరేబియాపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ నుండి తీవ్ర ఒత్తిడి వస్తున్న తరుణంలో ట్రంప్ పై వ్యాఖ్య చేశారు. ఈ విషయం గురించి సమూలంగా తెలుసుకోవాలనుకుంటున్నానని, సౌదీని కూడా వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నానని ట్రంప్ విలేకర్లతో చెప్పారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు