ఆటో డ్రైవర్ అకౌంట్లోకి రూ. 300 కోట్లు..
- October 14, 2018
పాకిస్థాన్:ఆటో డ్రైవర్ ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 వందల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. కరాచీ పట్టణానికి చెందిన ముహమ్మద్ రషీద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల రషీద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దాంతో వెంటనే రషీద్‌ను అదుపులోకి తీసుకుని ఇంతమొత్తంలో నగదు లావాదేవీలు ఎలా జరిగాయన్న దానిపై ఆరాతీశారు. దానికి రషీద్ తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని సమాధానం చెప్పాడు. ఇంటి అద్దె కట్టలేని రషీద్.. తన అకౌంట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో లావాదేలు జరగడంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అయితే ఈ బ్యాంకు ఖాతాని 2005లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీ వారు ఓపెన్ చేశారని.. తన జీతం డబ్బులు అందులో వేసేవారని. కొద్ది నెలల తర్వాత తాను ఆ ఉద్యోగం మానేసి ఆటో తోలుకుంటున్నాని అన్నాడు. తన జీవితంలో ఇంత వరకు లక్ష రూపాయలు కూడా చూడలేదు.. అలాంటిది మూడువందల కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉందనడం నా ఊహకు కూడా అందని విషయం. అంటూ నిరాశగా వెల్లడించాడు రషీద్. కాగా ఆ డబ్బు ఎవరి అకౌంట్ లోనుంచి ఎవరికీ చేరిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







