స్తంభించిన యూట్యూబ్..
- October 16, 2018న్యూయార్క్: ప్రపంచంలోనే ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్ యూట్యూబ్ సేవలు ఆకస్మత్తుగా బుధవారం(అక్టోబర్ 17) నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ పనిచేయడం ఆగిపోయింది.
దీంతో అనేక మంది నెటిజన్లు యూట్యూబ్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను ఆ సంస్థ దృష్టికి తెలియజేశారు. దీనికి యూట్యూబ్ స్పందించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్డేట్ చేస్తామని యూట్యూబ్ సంస్థ
ఆ తర్వాత మరో ట్వీట్లో సమస్య పరిష్కారమైందని, మీ ముందుకు మళ్లీ వచ్చామని.. సహనంతో వేచిచూసినందుకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, అంతకుముందు, యూట్యూబ్ కంటెంట్ చూడాలని వెబ్సైట్లోకి వెళ్తే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, 503 నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశారు.
అలాగే యూజర్స్‌కు వెబ్సైట్ లాగిన్ కావడం లేదని పేర్కొన్నారు. గత నెలలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 40నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ సర్వీసులు పునర్ ప్రారంభం కావడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు