నేడు తెరుచుకోనున్న శబరిమల
- October 16, 2018
మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈరోజు సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరువాత నేడు ఆలయాన్ని తెరుస్తున్నారు. ఇప్పటికే కేరళ వ్యాప్తంగా సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
ఆలయ భాగస్వామ్య పక్షాలతో నిన్న ట్రావెన్‌కోర్ దేవస్థాన మండలి భేటీ అయినప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడంతో కేరళలో నిరసనలను తగ్గించేందుకు తోడ్పడే పెద్ద నిర్ణయాలేవీ తీసుకోలేకపోయింది. తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టును తాము కోరేది లేదని కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పడం, అటు కేంద్రం నుంచి కూడా స్పందన లేకపోవడంతో నిరసనలు తాజాగా మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ విషయంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. అయ్యప్ప గుడికి వెళ్తున్న మహిళలను నిలక్కళ్ వద్ద భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తు లు అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రైవేటు వాహనాలేగాక కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లోకి ఎక్కి నిషేధిత వయస్సుల్లో ఉన్న స్త్రీలను కిందికి దించి వేస్తున్నారు.
ఆలయానికి వెళ్తున్న భక్తులను అడ్డుకునేందుకు తాము ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. భక్తులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







