హిట్ అండ్ రన్: 3 గంటల్లోనే డ్రైవర్ అరెస్ట్
- October 17, 2018రస్ అల్ ఖైమా పోలీసులు, అత్యంత వేగంగా స్పందించి హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన డ్రైవర్ని అరెస్ట్ చేశారు. కేవలం మూడు గంటల్లోనే బైకర్ని అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు తమ సమర్థతను ఇంకోసారి చాటి చెప్పారు. రోడ్డు ప్రమాదానికి కారకుడైన నిందితుడు, ప్రమాదం జరిగాక అక్కడి నుంచి పారిపోయినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి చెప్పారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అలర్ట్ అయిన కంట్రోల్ ఆపరేషన్స్ రూమ్, సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్, అంబులెన్స్ పారా మెడిక్స్ని పంపించడం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యింది నిందితుడి కోసం. మూడు గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..