అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం: వృద్ధుడు, ఇద్దరు చిన్నారుల మృతి
- October 20, 2018అజ్మన్‌లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం ఓ వృద్ధుడిని, ఇద్దరు చిన్నారుల్ని బలిగొంది. అజ్మన్ సివిల్ డిఫెన్స్ సెంట్రల్ ఆపరేషన్ రూమ్‌కి ఈ ఘటనపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించారు. అల్ రషిదియా ప్రాంతంలోని 6 అంతస్తుల భవనంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌లు, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించాయి. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే పొగను ఎక్కువగా పీల్చేయడం, కాలిన గాయాల కారణంగా వారు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు