ఎఫ్టీఐఐ చైర్మన్ పదవికి అనుపమ్ ఖేర్ రాజీనామా
- October 31, 2018ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) చైర్మన్ పదవికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బుధవారంనాడు రాజీనామా చేశారు. అంతర్జాతీయ టెలివిజన్ షోతో సహా తనకున్న బిజీ కమిట్మెంట్ల కారణంగా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఓ ట్వీట్లో పేర్కొన్నారు. 'ప్రతిష్ఠాత్మక ఎఫ్టీఐఐ చైర్మన్‌గా పనిచేయడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ఎంతో గొప్పు అనుభవం సంపాదించే అవకాశం దొరికింది. అయితే అంతర్జాతీయ కమిట్మెంట్లు ఉండటంతో తగిన సమయాన్ని సంస్థకు కేటాయించలేకపోతున్నాను. ఆ కారణంగానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అంధరికీ ధన్యవాదాలు' అని ఆ ట్వీట్లో అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. కాగా, సంస్థను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారంటూ విద్యార్థుల నుంచి విమర్శల దుమారం రేగడంతో గజేంద్ర చౌహాన్ స్థానంలో 2017 అక్టోబర్ 11న ఎఫ్టీఐఐ కొత్త చైర్మన్‌గా అనుపమ్ ఖేర్‌ను నియమించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..