వెంకీ ఇంట మ్రోగనున్న పెళ్లి బాజా
- November 05, 2018సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి పిల్లలకి దాదాపుగా వివాహాలు అయ్యాయి. చిరు ముగ్గురు పిల్లలకి ఎప్పుడో పెళ్లిళ్లు అయ్యాయి. ఇక బాలయ్య ఇద్దరు కూతుళ్లకి పెళ్లి అయ్యి కొడుకు మోక్షజ్ఞ మాత్రమే పెళ్లికి ఉన్నాడు. మోక్షజ్ఞ ఇంకా చిన్నోడే. ఇక నాగార్జున కూడా నాగ చైతన్యకి పెళ్లి చేశాడు. ఇక సీనియర్ హీరోస్ లో వెంకటేష్ తన పిల్లల పెళ్లిళ్లు చెయ్యాల్సి ఉంది. అయితే మొన్నీమధ్యనే వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్లి జరగబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. ఆశ్రిత ఎవరినో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతుందనే న్యూస్ హైలెట్ అయ్యింది.
అయితే ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డి మనవడితో జరగనున్నదట. సురెందర్ రెడ్డి మనవడు వెంకీ కూతురు ఆశ్రిత మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడంతో ఇటు వెంకీ ఫ్యామిలీ అటు సురెందర్ రెడ్డి ఫ్యామిలీ ఈ పెళ్లి విషయమై మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావడం. ఇరు పెద్దలు కలిసి పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడం జరిగిందని చెబుతున్నారు. కార్తీక మాసం అంటే నవంబర్ 24న వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం జరగనుందట.
అయితే పెళ్లికి కేవలం 20 రోజులు మాత్రమే ఉండడంతో. ఇరు కుటుంబాల వారు ఆశ్రిత పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తుంది. పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు