పండక్కి పతంజలి జీన్స్.. 25% డిస్కౌంట్..
- November 05, 2018
ఈ దీపావళి పండుగను పతంజలి వస్త్రాలు ధరించి మరింత ఆనందంగా జరుపుకోమంటూ మార్కెట్లోకి తీసుకు వచ్చారు బాబా రాందేవ్. ఢిల్లీలో పతంజలి పరిధాన్ పేరిట యాక్సెసరీస్ స్టోర్‌ను సోమవారం ప్రారంభించారు. స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ వస్త్రాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని స్టోర్‌లు ఏర్పాటు చేసి అందరికి అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్‌లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. మహిళలు, పురుషులు, చిన్నారుల అభిరుచులకు తగ్గట్లు ఇక్కడ దుస్తులు లభ్యమవుతాయి. ఇంకా పండగ సీజన్‌ని పురస్కరించుకుని 25 శాతం డిస్కౌంట్‌తో దుస్తులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జీన్స్ రూ.500, బ్రాండెడ్ షర్ట్ రూ.500 కే ఇస్తున్నట్లు తెలిపారు. 7వేల రూపాయల విలువ చేసే వస్త్రాలను రూ.1100లకే ఇస్తున్నట్లు తెలియజేశారు. పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలను నియంత్రించి స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించే దిశగా పతంజలి పరిధాన్‌ను తీసుకు వచ్చామని రాందేవ్ అంటున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







