మెగాస్టార్ ఇంట దీపావళి సంబరాలు..
- November 08, 2018ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలుఅట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాఫ్యామిలీ మొత్తం హాజరైంది. దీనికిసంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మెగాహీరోలందరూ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. సాయి ధరం తేజ్,వైష్ణవ్ తేజ్ లు తెల్లపంచె కట్టుకొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.వరుణ్ తేజ్, బన్నీల కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవికుర్తా పైజామాలో హుందాగా కనిపిస్తున్నారు.
ఈ హీరోలందరూ కలిసి తీసుకున్నఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. అలానే చిరంజీవిని మధ్యలోపెట్టి మెగాడాటర్స్, కోడళ్లు దిగిన ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఆయనప్రజాపోరాట యాత్రలో బిజీగా ఉండడంతో ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు