ఎన్ ఎస్ జి కమాండర్ గా ఆది..
- November 08, 2018
ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. 'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్' రూపొందే ఈ మూవీకి 'వినాయకుడు' ఫేమ్ అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్‌టెల్ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా పాపులర్ అయిన సాషా ఛెత్రి ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. పోస్టర్‌లో ఎన్ ఎస్ జీ కమాండోగా ఆది సాయికుమార్ లుక్ కొత్తగా ఉంది.. ఈ చిత్రంలో ఎన్ ఎస్ జి కమాండో అర్జున్ పండిట్‌గా ఆది కనిపిస్తారు. నిత్య నరేష్, కార్తీక్ రాజు, పార్వతీశం, అబ్బూరి రవి, క్రిష్ణుడు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషించారు. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై ప్రతిభ అడివి, కట్ట ఆశీష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీశ్ డేగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
. గూఢచారి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఊపిరి, క్షణం, కేరింత, ఎవడు వంటి చాలా చిత్రాలకు మాటలు సమకూర్చిన అబ్బూరి రవి ఈ మూవీ ద్వారా నటుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి