మందు బాబులకు ముందస్తు హెచ్చరిక..
- November 10, 2018తెలంగాణ:ఆఫీస్ నుంచి అటునుంచి అటే ఫ్రెండ్స్‌తో కబుర్లు, కాలక్షేపం చేసి ఓ చుక్క మందేసి ఇంటికి వచ్చే మగమహారాజులు ఎందరో. ఏంటీ ఇంతలేటైందని ఇల్లాలు ప్రశ్నిస్తే ఆఫీస్‌లో బాస్‌తో అర్జంట్ మీటింగ్, లేదంటే ఎవరికో ప్రమోషన్ వచ్చిందని ఏదో ఒక స్టోరీ రెడీమేడ్‌గా అల్లేస్తుంటారు.
మరి నాలుగు రోజులు మందు దుకాణం బంద్ చేస్తే పరిస్థితి ఏంటి. ఎలక్షన్ల పుణ్యామా అని మద్యం ప్రవహిస్తుంటే పోలింగ్ జరిగే తేదీలకు ముందు రెండు రోజులు పోలింగ్ ముగిసిన తరువాత రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు మందు బాబులకు శెలవు ప్రకటించింది ప్రభుత్వం. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా.. 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈ నేపథ్యంలో 5 వ తేదీ సాయింత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అదే విధంగా 11వ తేదీన కూడా షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల ఘట్టాన్ని ప్రశాంతంగా ముగించడానికే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు