కువైట్‌ను కుదిపేస్తున్న భారీ వర్షాలు
- November 10, 2018
కువైట్ సిటీ: గల్ఫ్ దేశం కువైట్‌లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడివారిని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులతోపాటు వలసజీవులకు సూచించారు. బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వారాంతంలో కుండపోత వర్షాలు కురవనున్నాయని సూచించారు. అత్యవసర నంబర్ 112 సేవలు 24 గంటలపాటు కొనసాగుతాయని, ట్రాఫిక్, ఇతర సమస్యలను వెల్లడించవచ్చునని అధికారులు సూచించారు. కోస్ట్‌గార్డ్ హాట్‌లైన్ నంబర్ 1880888 కి కూడా సమస్యలను ఫిర్యాదు చేయవచ్చన్నారు. వర్షాల కారణంగా దేశం అంతటా ఎమర్జెన్సీ వాతావరణం ఉందన్నారు. ఈ మేరకు కువైట్ ప్రధానమంత్రి షేక్ జబర్ అల్ ముబారక్ అల్ హమద్ అల్ సబన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉందని, రోడ్లపై ప్రయాణించేవారు జాగ్రత్తగా వెళ్లాలని, అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని సూచించారు. ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని హెచ్చరించారు.
--వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







