భారతీయుడు 2 లో కనిపించనున్న సల్మాన్
- November 10, 2018కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు..తమిళ్ , తెలుగు భాషల్లో రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరవాత ఈ సినిమాను సీక్వెల్ తెరకెక్కిందామని అనుకున్నారు కానీ అది కుదరలేదు. మళ్లీ ఇంత కాలానికి దీనికి సీక్వెల్ తెరపైకి వచ్చి అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో మహానటి ఫేమ్ సల్మాన్ దుర్క్యూర్ నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులో మహానటి సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సల్మాన్ , అంతకు ముందు ఓకే బంగారం సినిమాతో తెలుగు తెరపై కనిపించాడు. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా నయనతార పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ను ఖరారు చేయగా , ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!