హైదరాబాదులో 'మహర్షి' కీలకమైన సన్నివేశాలు
- November 10, 2018
తన కెరియర్ లో 25వ చిత్రమైన మహర్షి సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇండస్ట్రీ లో భారీ నిర్మాతలు అయిన దిల్ రాజు మరియు అశ్వినీ దత్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల యూఎస్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
సినిమాకి సంబంధించిన చాలా చిత్రీకరణ అమెరికాలో కానీ చేశాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రాముఖ్యమైన సన్నివేశాలు కొన్ని మిగిలి ఉండటంతో హైదరాబాద్ నగరంలో పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్లు సమాచారం.
సినిమాకు సంబంధించిన కీలకమైన ఈ సన్నివేశాలలో అల్లరి నరేశ్ .. పూజా హెగ్డే నటిస్తున్నారట. డిసెంబర్లో జరిగే పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తికానుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఏఫ్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
వేసవి కానుకగా విడుదల కాబోతున్న 'మహర్షి' సినిమా పై భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. మహేష్ విడుదల అయిన చివరి సినిమా 'భరత్ అనే నేను' ఇండస్ట్రీ హిట్ అవడంతో..రాబోతున్న 'మహర్షి' కూడా అదే స్థాయిలో హిట్టు కొడుతుందని తమ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







