ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ
- November 20, 2018అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కోర్టు నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సీఎన్ఎన్ జర్నలిస్టు ప్రెస్ కార్డును వాపస్ చేయాలని వాషింగ్టన్ కోర్టు ఆదేశించింది. తాజాగా దక్షిణ అమెరికా నుంచి వలస వస్తున్నవారికి ఆశ్రయం నిరాకరించరాదంటూ శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు ఆదేశించింది. దీంతో ట్రంప్ దూకుడుకు తాత్కాలికంగా మరోసారి బ్రేకులేసినట్లయింది.
అమెరికాలో ఆశ్రయం పొందేవారు సరైన పత్రాలు చూపించాలని, ఆశ్రయం పొందేందుకు నౌకాశ్రయాల్లోని చెక్ పాయింట్ల ద్వారా వచ్చేవారినే అనుమతిస్తామని, అలా కాకుండా నిఘా కళ్లు గప్పి భూమార్గం గుండా వచ్చేవారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తామని ట్రంప్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9 నుంచి ట్రంప్ ఆదేశాలు అమల్లోకి కూడా వచ్చాయి. దీంతో మానవ హక్కుల సంఘాలు, వలసబాధితులు కోర్టుకెక్కారు. వారి విజ్ఞాపనలపై స్పందించిన కోర్టు.. ట్రంప్ ఆదేశాలను రద్దు చేసింది. ఈ విషయంలో కోర్టు మళ్లీ ఆదేశాలు జారీ చేసేదాకా దీన్నే తుది శాసనంగా భావించాలని పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా వర్తిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!