రీ-షూట్ కి పారితోషికం అడిగిన సాయిపల్లవి
- November 20, 2018
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా పడి పడి లేచె మనసు రూపొందుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. సుధాకర్ - ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రీ- షూట్ చేస్తున్నారు.
కొన్ని సీన్స్ మరింత బాగా రావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు రీ షూట్ ను ప్లాన్ చేశారు. ఇందుకోసం సాయిపల్లవి డేట్స్ మళ్లీ అవసరమయ్యాయి. అయితే కొత్తగా ఇచ్చే డేట్స్ కి కూడా పారితోషికం ఇవ్వవలసిందేనని సాయిపల్లవి అడిగితే అందుకు నిర్మాతలు అంగీకరించినట్టుగా సమాచారం. ఎక్కువ పారితోషికం ఇస్తామన్నా, కథ బాగోలేకపోతే సాయిపల్లవి నో చెప్పేస్తుంది. అలాంటింది ఈ సినిమా రీ-షూట్ కి పారితోషికం అడగడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ప్రతి విషయంలోను సాయిపల్లవి ఒక క్లారిటీతో ఉంటుందని అంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







