పరగడుపున కాలిఫ్లవర్ రసం తాగితే...

పరగడుపున కాలిఫ్లవర్ రసం తాగితే...

కాలిఫ్లవర్ అన్ని కాలాల్లో లభిస్తుంది. చలికాలంలో మరింత ఎక్కువగా దొరుకుతుంది. వీటి ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. ఈ కాలిఫ్లవర్‌ను గోబిపువ్వు అని కూడా పిలుస్తారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాంటి కాలిఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం.

* కాలిఫ్లవర్‌ను తరచుగా ఆరగించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
* గోబి పువ్వును తినడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.
* దీని ఆకులను సలాడ్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
* వ్యాధుల బారినపడివారు ఈ ఆకులు తింటే త్వరగా కోలుకుంటారు.
* ప్రతి రోజూ 50 గ్రాముల కాలిఫ్లవర్ ఆకులు తింటే దంత సమస్యలు ఉండవు.
* దంతాలు, చిగుళ్లు మరింత దృఢంగా మారుతాయి.
* వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.
* ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున కాలిఫ్లవర్ రసాన్ని తాగితే కేన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
* జీర్ణాశయంతో పాటు పేగులు శుభ్రం చేస్తుంది.
* శరీరానికి ఏదేని గాయమైతే కాలిఫ్లవర్ ఆకుల రసం రాస్తే తక్షణం తగ్గిపోతుంది. పుండ్లు త్వరగా మాయమైపోతాయి.

Back to Top