అమరావతి:హ్యాపీనెస్ట్ ఫ్లాట్స్ బుకింగ్స్
- December 10, 2018
అమరావతిలో ప్రజలకోసం నిర్మించే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌లో రెండో దశ బుకింగ్ నేడు ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే బుకింగ్స్ కోసం.. అన్ని ఏర్పాట్లు చేశారు సీఆర్‌డీఏ అధికారులు. రాష్ట్రంలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో సైతం ఈ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం, ఇంటర్నెట్ వినియోగం పట్ల అవగాహన లేని సాధారణ ప్రజలకు ఈ కేంద్రాల ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ గృహ సముదాయంలోని 900 ఫ్లాట్ల్లకు ఇవాళ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలకు సహాయపడేందుకు ఏపీసీఆర్డీయే విస్తృత సన్నాహాలు చేసింది. . ఆన్‌లైన్‌లో జరిగే ఈ ప్రక్రియపై సరైన అవగాహన లేని వారితోపాటు ఇంటర్నెట్ సదుపాయం లేనివారి కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తోంది. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ బ్యాంకులు, మీసేవా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 9 గంటల నుంచి ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఆయా కేంద్రాల వివరాలు హ్యాపీనెస్ట్ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. కాగా.. ఈ బుకింగ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీఆర్డీయే శుక్రవారం నుంచి నిర్వహిస్తున్న సదస్సులు శనివారంతో ముగిశాయి. హ్యాపీనె్‌స్టలోని 3 టవర్ల(ఏ, బీ, సీ)లో ఉన్న 300 ఫ్లాట్లకు నవంబరు 9న బుకింగ్ ప్రారంభించగా కేవలం కొన్ని గంటల్లోనే ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో మలివిడతగా ఈ ప్రాజెక్ట్‌లోని మరొక 9 టవర్లు డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్, ఐ, జే, కే, ఎల్ లోని 900 ఫ్లాట్లకు ఇవాళ బుకింగ్ ప్రారంభించనున్నారు.
బుకింగ్‌దారులకు సీఆర్డీయే.. హ్యాపీనెస్ట్ వెబ్‌సైట్ ద్వారా కొన్ని సూచనలు చేసింది. బుక్ చేయాలనుకుంటున్న ఫ్లాట్లకు సంబంధించిన నగదు నెట్ బ్యాంకింగ్ లిమిట్‌లో లేనట్లయితే వాటిని పెంచాల్సిందిగా ఆయా బ్యాంకులను కోరాలని తెలిపింది. ప్రవాస భారతీయులు తమ చెల్లింపులను భారత కరెన్సీలోనే చెల్లించాలని సూచించింది. నగదును తమ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ల ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొంది. అంతర్జాతీయ బ్యాంకులకు చెందిన ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్ అకౌంట్ల ద్వారా జరిపే చెల్లింపులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇక.. సులభంగా, త్వరగా బుక్ చేసుకునేందుకు ‘గూగుల్ క్రోమ్ 45, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 46, ఎడ్జ్ 13, సఫారీ 10 ఉండే నెట్‌వర్క్‌లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







