ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తల్లి కన్నుమూత
- December 16, 2018ముంబై: బాలీవుడ్ తొలితరం నటుడు వినోద్ ఖన్నా తొలి భార్య గీతాంజలి ఖన్నా(70) కన్నుమూశారు. ఆమె మృతికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే, గత కొంతకాలంగా ఆమె గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన గీతాంజలిని శనివారం రాత్రి అలీబాగ్ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖ నటులు అక్షయ్ ఖన్నా, రాహుల్ ఖన్నాలు ఆమె కుమారులే. మూత్రాశయ కేన్సర్‌తో బాధపడుతున్న వినోద్ ఖన్నా గతేడాదే మృతి చెందారు. గీతాంజలి-వినోద్ ఖన్నాలు 1971లో వివాహం చేసుకున్నారు. 1985లో విడిపోయారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక