విమాన, బస్ టికెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్
- December 16, 2018
న్యూయార్క్: స్‌మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విమాన, బస్ టికెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ విమానాలపై రూ 1000, అంతర్జాతీయ విమానాలపై 12 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసింది. వీటికితోడు హోటల్ బుకింగ్స్‌పై 50 శాతం తగ్గింపును ఆఫర్ చేసింది. ఇక బస్ ప్రయాణీకులకూ ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. బస్ టికెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది.
మరోవైపు ఈ ఆఫర్లను ఉపయోగించుకునేందుకు ఎలాంటి కూపన్ కోడ్‌ను వాడాల్సిన పనిలేదు. ఫ్లిప్‌కార్ట్ తాజా ఆండ్రాయిడ్ యాప్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్‌లోనూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ఇండిగో న్యూ ఇయర్ సేల్‌కు ఆదివారం చివరి రోజు కావడం గమనార్హం. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయ విమాన టికెట్లను రూ 3239 రూపాయల నుంచి ఇండిగో ఆఫర్ చేస్తోంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..