ఉన్మాది మూవీ ట్రైలర్ విడుదల
- December 16, 2018ప్రవీణ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ఉన్మాది. . ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది. త్వరలోనే ఆడియో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ - "ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. గుంటూరు జిల్లాలోపరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణను పూర్తి చేశాం. 8ఫైట్స్, 5 సాంగ్స్‌తో సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. టీజర్‌ను విడుదల చేశాం. సమాజంలో ఆడ పిల్లలపై జరగుతున్న అఘాయిత్యాలపై తెరకెక్కిన కథాంశం ఇది. త్వరలోనే ఆడియో, సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం" అన్నారు.
టైటిల్ పాత్రలో ఎన్.ఆర్.రెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించారు. అల్లు రమేశ్, శివ, శిరీష, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత, సోను, రాజేశ్వరి, డిఎస్పి, వెంకటాంజనేయులు, ఫణి సూరి, మున్నా, జానకి రామయ్య తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్, కెమెరా: దంటు వెంకట్, ఎడిటర్: కె.ఎ.వై.పాపారావు, ఫైట్స్: దేవరాజ్, కొరియోగ్రఫీ: సామ్రాట్, జోజో, నిర్వహణ: ఎన్.వరలక్ష్మి, క్రియేటివ్ డైరెక్టర్ : రాఘవ, నిర్మాత: ఎన్.రామారావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.ఆర్.రెడ్డి. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ను మీరూ చూడండి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ