అల్లు శిరీష్ - 'ఎబిసీడీ' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
- December 28, 2018అల్లు శిరీష్, కృష్ణార్జున యుద్ధం ఫేమ్, రుక్సార్ థిల్లాన్ జంటగా, సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, పెళ్ళి చూపులు ఫేమ్, యష్ రంగినేని కలిసి నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు సమర్పిస్తున్న సినిమా, ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనేది ట్యాగ్ లైన్.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
అల్లు బాబు ఓ రోడ్లో స్కేటింగ్ చేస్తూ, స్టైల్‌గా సలాం చేస్తున్నాడు ఫస్ట్ లుక్ పోస్టర్లో.. ఇక మోషన్ పోస్టర్లో అయితే, రోడ్లపై స్కేటింగ్‌తో రకరకాల విన్యాసాలు చేసాడు. ధనవంతుడైన ఒక కుర్రాడు, పేదవాడిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే పాయింట్‌తో మలయాళంలో తెరకెక్కిన ఏబీసీడీ మూవీని, అదే పేరుతో తెలుగులో అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నారు..
హీరోగా నిలదొక్కుకోవడానికి కిందా మీదా పడుతున్న శిరీష్, ఈ సినిమా తనకి బ్రేక్ ఇస్తుందనే హోప్‌తో ఉన్నాడు. 2019 ఫిబ్రవరిలో ఏబీసీడీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి మాటలు : కళ్యాణ్ రాఘవ్, కెమెరా : రామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ