అయ్యో! 15 మంది సజీవ సమాధి అయినట్టేనా?
- December 28, 2018
మేఘాలయలోని బొగ్గుగనిలో చిక్కుకున్న 15మంది సజీవ సమాధి అయినట్లేనని షిల్లాంగ్ కాంగ్రెస్ ఎంపి విన్సెంట్ హెచ్ పాలా తెలిపారు. ఈస్ట్ జంతియా జిల్లాలో డిసెంబర్ 15న ఓ అక్రమ మైనింగ్ గనుల్లో వీరంతా చిక్కుకున్నారు. మైనర్లను రక్షించేందుకు గువాహటిలోని ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్ ఆపరేషన్ చేపట్టింది. గనిలో నీటిని తోడితే తప్ప మైనర్లను వెలికి తీయడం కష్టతరమైంది. నీటిని పంపింగ్ చేసేందుకు మోటార్లు ఉపయోగించింది. చిక్కుకున్న వారిని వెలుపలకి తెచ్చేందుకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు మరిన్ని పంపులు కావాలని ఉన్నతాధికారులు మొర పెట్టుకున్నా ఇప్పటికి మోటార్లు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. అయితే ఘటన జరిగి 15రోజులు కావస్తున్నందున బతికి బట్టకట్టడం అసాధ్యమని, ఇప్పటికే ఆ ప్రాంతంలో దుర్గందం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. అయితే మొత్తం ఘటన జరిగిన తీరుపై షిల్లాంగ్ ఎంపి విన్సెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సకాలంలో కేంద్రం స్పందించే ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేదని కాదన్నారు . ఇప్పటికైనా కేంద్రం సీరియస్ గా తీసుకుని మోటార్లతో నీరు తోడి మైనర్ల దేహాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







