విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు..!

- December 28, 2018 , by Maagulf
విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లు..!

 దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రయాణికుల తనిఖీల కోసం బాడీ స్కానర్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి పరిశీలించామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ కుమార్ రాజేష్ చంద్ర చెప్పారు. అమెరికాలోని విమానాశ్రయాల్లో ఉన్న బాడీ స్కానర్లను మన దేశంలోనూ ప్రవేశపెట్టడం ద్వార వేగంగా సిబ్బంది లేకుండా ప్రయాణికులను తనిఖీ చేయవచ్చని కుమార్ రాజేష్ పేర్కొన్నారు. బాడీ స్కానర్ల వల్ల రేడియేషన్ ప్రభావం ఉన్నందువల్ల వీటికి ఆటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో వచ్చే రెండేళ్లలోగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీల కోసం బాడీస్కానర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇండియా ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com