సీబీఐ డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర్రావు
- January 11, 2019సీబీఐ డైరక్టర్‌గా నాగేశ్వర్రావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ అలోక్ వర్మను డైరక్టర్ హోదా నుంచి తప్పించడంతో.. ఆయన స్థానంలో నాగేశ్వర్రావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు.. అలోక్ వర్మను తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మరో స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానాతో వివాదం చెలరేగిన కారణంగా.. ఇటీవల అలోక్ వర్మను సెలవుపై పంపించారు. కానీ ఆయన సుప్రీంలో పిటిషన్ వేశారు. అలోక్ వర్మ లీవులో ఉన్న అక్టోబర్‌లో నాగేశ్వర్రావు తాత్కాలిక చీఫ్‌గా కొనసాగారు. నాగేశ్వర్రావు 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. అక్టోబర్ 23వ తేదీన ఆయన తెల్లవారుజామున 2 గంటలకు నాటకీయ పద్ధతిలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక